Home / 18+ / టాక్ “లండన్ – చేనేత బతుకమ్మ – దసరా” వేడుకల పోస్టర్ ఆవిష్కరించిన ఎంపీ కవిత

టాక్ “లండన్ – చేనేత బతుకమ్మ – దసరా” వేడుకల పోస్టర్ ఆవిష్కరించిన ఎంపీ కవిత

అక్టోబర్ 20 న వెస్ట్ లండన్ లో వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపిన అధ్యక్షురాలు పవిత్ర కంది.తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆద్వర్యం లో అక్టోబర్ 20 వ తేదీనాడు నిర్వహిస్తున్న “లండన్ – చేనేత బతుకమ్మ – దసరా ” వేడుకల పోస్టర్ ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు – ఎంపీ కవిత ఆవిష్కరించారు.నేడు హైదరాబాద్ లో టాక్ ప్రతినిధులు మధుసుధన్ రెడ్డి, శ్వేతా మరియు జాహ్నవి ఎంపీ కవిత ను కలిశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనివ్వడానికి చేస్తున్న కార్యక్రమాలకు స్పూర్తితో, ఈ సంవత్సరం కూడా టాక్ జరిపే వేడుకలను “చేనేత బతుకమ్మ” గా నిర్వహిస్తున్నామని, వీలైనంత వరకు ప్రవాసులల్లో చేనేత పై అవగాహన కలిపించి, వీలైనన్ని సందర్భాల్లో చేనేత వస్త్రాలు ధరించి నేత కుటుంబాలకు అండగా నిలవాలని కోరుతున్నట్టు తెలిపారు.పోయిన సంవత్సరం “చేనేత బతుకమ్మ” వేడుకల ద్వారా సిరిసిల్ల చేనేత కార్మికులకు అందించిన చేయూత గురించి ఎంపీ కవితకు టాక్ నాయకుడు మధుసుధన్ రెడ్డి వివరించారు.

చేనేత పేరుతో బతుకమ్మ వేడుకల్ని నిర్వహించి నేతన్నలను ఆదుకోవాలనే సంకల్పం బాగుందని, వీరి ప్రయత్నం ఫలించి నేత కుటుంబాలకు మరింత మేలు జరగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ కవిత.లండన్ నుండి టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది ఫోన్ ద్వారా మీడియా కి తన సందేశాన్నిస్తూ, టాక్ సంస్థ ఆవిర్భావం నుండి నేటి వరకు అన్ని సందర్భాలలో ఎంపీ కవితగారి ప్రోత్సాహం చాలా గొప్పదని, నేటి “చేనేత బతుకమ్మ” పోస్టర్ ఆవిష్కరించి మాలో నూతన ఉత్సాహాన్ని నింపిన కవిత గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేస్తినట్టు చెప్పారు.ఇది ఒక వేడుకలాగా కాకుండా ఎంతో బాధ్యతతో చేనేతకు చేయూతను అందించే గొప్ప అవాకాశంలా భావించి నిర్వహిస్తున్నామని, పోయిన సంవత్సరం ప్రవాసుల నుండి మంచి స్పందన ఆదరణ లభించిందని, వీలైనంతగా నేతన్నలకు మేలు జరిగేలా నేత వస్త్రాలు ధరించి వేడుకల్లో పాల్గొన్నారని, ఈ సంవత్సరం కూడా “చేనేత బతుకమ్మ” ద్వారా నేతన్నలకు మరింత మేలు జరగాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.

టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం కూడా తన సందేశాన్నిస్తూ, బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన ఎంపీ కవిత గారు అనుక్షణం అన్ని సందర్భాల్లో ఇస్తున్న ప్రోత్సాహం మాకందరికి ఎంతో స్ఫూర్తిదాయకమని, వారి సలహాలు సూచనలతో ఇంకెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని, పోస్టర్ ఆవిష్కరించి ముందుకు నడిపిస్తునందుకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. మంత్రి కే.టీ.ఆర్ గారి ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా చేనేతకు వీలైనంత చేయూతనందిస్తున్నామని తెలిపారు.అక్టోబర్ 20 వ తేదీనాడు ఉదయం పది గంటల నుండి వెస్ట్ లండన్ లోని ” ఐసల్ వర్త్ అండ్ సయాన్ స్కూల్” ఆడిటోరియం లో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రవాస బిడ్డలంతా వీలైతే చేనేత దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొనాలని, మనంత చేనేతకు అండగా నిలవాల్సిన చారిత్రాత్మక సమయమిదని తెలిపారు.చేనేత వాస్త్రాలకై www.tauk.org.uk వెబ్సైట్ ను సందర్శితే వివరాలు ఉన్నాయని తెలిపారు.

నేడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా చేనేత చీరలను అందిస్తుందని, మనమంతా మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా, ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న అన్ని బతుకమ్మ వేడుకల్లో, చేనేతకు ప్రాధాన్యతనిస్తూ, చేనేత దుస్థలతో వేడుకలను జరువుపుకుంటే, చేనేత కుటుంబాల్లో గొప్ప భరోసా వస్తుందని తెలిపారు.ఈ పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్న టాక్ ప్రతినిధులు మధుసుధన్ రెడ్డి, శ్వేతా మరియు జాహ్నవి గారికి కృతఙ్ఞతలు తెలుపుతూ, అలాగే నేటి కార్యక్రమానికి సహకరించిన జాగృతి రాష్ట్ర నాయకులు శరత్ రావు, రాజీవ్ సాగర్, ప్రణీత్ రావు, నవీన్ ఆచారి, సంతోష్ రావు కొండపల్లి మరియు విజయ్ కోరబోయన గార్లకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat