ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖ జిల్లలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం భీమిలి నియోజకవర్గంలోని గండిగండం క్రాస్ నుండి జగన్ పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర లో జగన్ ని చూడటానికి తమ బాధలను సమస్యలను తెలియజేయడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. ఈ పాదయాత్ర లో జగన్ ప్రతి ఒక్కరి సమస్య వింటూ వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగారు. ఈ నేపథ్యంలో జగన్ ఏపీ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వారి సమస్యలు తెలియజేస్తూ జగన్ కి వినతి పత్రం అందజేశారు. పదవీ విరమణ చేసిన జర్నలిస్టులకు నెలకు రూ.10 వేలు పెన్షన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జర్నలిస్టు చనిపోతే వారి కుంటుంబ సభ్యులకు నెలకు ఐదు వేలు పెన్షన్ ఇవ్వాలని కోరారు. జర్నలిస్టుల సమస్యలపై పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత పెన్షన్‌పై తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. జర్నలిజం విభాగాల్లో సాంకేతిక వనరుల కల్పనకు జగన్ హామీ ఇచ్చారు. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని వారికి భరోసా ఇచ్చారు.