అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై ఆదివారం నాడు మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై మావోలు కాల్పులకు దిగారు. తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే సర్వేశ్వరరావు కన్నుమూశారు.మాజీ ఎమ్మెల్యే శివేరి సోము కూడా చనిపోయారు. ఇటీవల కాలంలో ఏజెన్సీలో మావోలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. దీంతో అవకాశం కోసం మావోయిస్టులు ఎదురుచూస్తున్నారు. ప్రజా ప్రతినిధులను టార్గెట్గా చేసుకుని నిర్ణయించారు. ఇందులో భాగంగానే కిడారి సర్వేశ్వరరావుని టార్గెట్ చేసినట్లు భావిస్తున్నారు. కిడారి ఇటీవలే వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.2014 ఎన్నికల్లో కిడారి సర్వేశ్వరరావు వైసీపీ నుండి విజయం సాధించారు. ఇటీవలనే కిడారి సర్వేశ్వరరావు టీడీపీలో చేరారు. అయితే ఈ సమాచారాన్ని ధృవీకరించుకొనేందుకు తమ సిబ్బంది ఘటన స్థలానికి వెళ్లారని ఎస్పీ ప్రకటించారు.