సిద్దిపేట జిల్లా కేంద్రంలో పశుసంవర్థక శాఖ అధికారి అంజయ్య గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న అంజయ్య భార్యను ఓదార్చారు. అంజయ్య మృతదేహాన్ని చూసిన హరీశ్ రావు కంటతడి పెట్టుకున్నారు. అంజన్న మమ్మల్ని వదిలి వెళ్లి ఎంత పనిచేస్తివే అని దిగ్ర్భాంతికి లోనై..కంటతడి పెట్టారు.
తాము ఆత్మీయ అధికారిని కోల్పోయామని హరీశ్ రావు అన్నారు. అంజన్న మమ్మల్ని వదిలి వెళ్లి ఎంత పని చేస్తివే..అని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఒక ఆత్మీయ అధికారిగా, కుటుంబ సభ్యునిగా, వృత్తిలో నిబద్ధతగా, మంచికి మారుపేరుగా పనిచేసిన అంజన్న.. తమ మధ్యనుండి వెళ్లి పోవడం తీవ్రంగా కలిచి వేసిందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. 14 ఏండ్లు సిద్దిపేట లో ఒక ఇంటి మనిషిలా ఉండి, తెలంగాణ ఉద్యమంలో ఆయన సేవలు మరువలేనివన్నారు. అధికారిగా అంజన్న మంచి సేవలు అందించారని కొనియాడారు. ఆయన అకాల మరణం తీరని లోటన్నారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. సిద్దిపేటలో పాడిగేదెలు పంపిణీ కార్యక్రమంలో అంజయ్యకు గుండెపోటు వచ్చింది