శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు ఈ రోజు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. శబరిమలాలయంలోకి మహిళలను అనుమతించాలా..? వద్దా..? అన్న విషయంపై ఐదుగురు సభ్యులున్నరాజ్యాంగ ధర్మాసనం నిర్ణయించనుంది.
కాగా, రుతుక్రమానికి లోనయ్యే 10 ఏళ్ల బాలికల నుంచి 50 ఏళ్ల మహిళల వరకు శబరిమల ఆలయంలోకి ప్రవేశించరాదన్న నిబంధనను ఆలయ బోర్డు అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇలా మహిళల ప్రవేశాన్ని నిరాకరించడం స్త్రీల పట్ల వివక్ష చూపడమేనంటూ దాఖలైన కేసును సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ నేపథ్యంలో మహిళల ఆలయ ప్రవేశం విషయంలో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులున్న రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది.
