★ ఎలాంటి ప్రమాదకరమైన రిస్క్ తీసుకోవడానికి కూడా భయపడని నాయకుడు
★ నాలుగేళ్లలో పేదల సంక్షేమమే ద్యేయంగా అనేక వినూత్న పథకాలకు శ్రీకారం
★ పారిశ్రామికంగా, వ్యవసాయికంగా చెప్పుకోదగిన స్థాయిలో అభివృద్ధి
★ పథకాలు , ప్రజల మీద నమ్మకంతోనే దైర్యంగా అసెంబ్లీ ఎన్నికలకు
★ ఉద్యమం నుండీ సంచలన నిర్ణయాలతో విజయాలు సాధించడం కేసీఆర్ ప్రత్యేకత
★ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సులువుగా విజయాన్నిసాధించే అవకాశం
★ ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక బిజినెస్ స్టాండర్డ్ లో న్యూస్ మేకర్ కాలమ్ లో మంచి పేరున్న కాలమిస్ట్ అదితి ఫడ్నిస్ అద్భుత విశ్లేషణ
తెలంగాణ రథసారథి , ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే ధైర్యం కలిగిన నాయకుడని ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక బిజినెస్ స్టాండర్డ్ ఒక అద్భుతమైన కథనాన్ని ప్రచురించింది . ఉద్యమ నాయకుడిగా , ముఖ్యమంత్రి గా ఎలాంటి ప్రమాదకరమైన రిస్క్ తీసుకోవడానికైనా కేసీఆర్ వెనుకాడరని ఆ పత్రిక అభిప్రాయపడింది . చాలా మంచి పేరున్న కాలమిస్ట్ అదితి ఫడ్నిస్ ‘న్యూస్ మేకర్’ అనే పాపులర్ కాలమ్ లో ఈ కథనాన్ని రాశారు . ఏ విషయంలో నైనా దైర్యంగా అడుగులు వేయడం వాటిలో విజయం సాధించడం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకత అని అందులో పేర్కొన్నారు. 2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ని స్థాపించి కొద్ది కాలంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించడంతో ఆ తర్వాత ఆయన బలం తెలిసి కాంగ్రెస్ పార్టీ ఆయన సారధ్యం వహిస్తున్న టి ఆర్ ఎస్ తో పొత్తుకు సిద్ధపడిందని ప్రస్తావించారు . తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాలుగేళ్లలోనే అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి మేలు చేసే ఎన్నో వినూత్న పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవంతంగా అమలు చేశారని పేర్కొన్నారు . లక్ష వరకు రైతు రుణ మాఫీ చేయడమే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకంతో రైతులకు ఎకరానికి ఏడాదికి ఎనిమిది వేల రూపాయలు ఎరువులు, విత్తనాల కోసం సాగుకు ముందుగానే పెట్టుబడి అందిస్తున్నారని ప్రశంసించారు . రైతు భీమా , మిషన్ భగీరథ , ఆసరా , కళ్యాణలక్ష్మి , షాదీ ముబారక్ , ఆసరా వంటి ఎన్నో మంచి పథకాలను అమలు చేసి ప్రజల ప్రశంసలు అందుకున్నారని వివరించారు . సాగు నీరు లేక తెలంగాణ రైతులు పడుతున్న కష్టాన్ని గమనించి భారీ స్థాయిలో కాళేశ్వరం, పాలమూరు , సీతారామ, డిండి వంటి ప్రాజెక్టులను చేపట్టారని ప్రస్తావించారు . దేశంలో ఎవరికీ సాధ్యం కాని భూరికార్డుల ప్రక్షాలన ను చేపట్టి ప్రజల ప్రశంసలు పొందారని ప్రస్తావించారు. పారిశ్రామికంగా , వ్యవసాయికంగా చాలా ప్రగతి సాధించడంతో పాటు చాలా మంచి పథకాలు అమలు చేశామనే ధైర్యంతోనే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రజల ముందుకు వెళుతున్నారని బిజినెస్ స్టాండర్డ్ ప్రశంసించింది . వ్యాసంలో తొలుత ఉద్యమ అంశాలను ప్రస్తావిస్తూ కేసీఆర్ పార్టీ ఏర్పాటు చేయగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో 20 జిల్లా పరిషత్ లకు గాను పదింటిని కైవసం చేసుకుని తన సత్తా ఏమిటో నిరూపించారని పేర్కొన్నారు. దాంతో ఖంగుతున్న కాంగ్రెస్ పార్టీ టి ఆర్ ఎస్ తో పొత్తుకు సిద్ధపడిందని వివరించారు . ఆ ఎన్నికల్లో 26 అసెంబ్లీ , 5 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుని టి ఆర్ ఎస్ రికార్డ్ సృష్టించిందని ప్రస్తావించారు. యూపీఏ మంత్రివర్గంలో చేరినప్పటికీ ప్రతీ సమయంలో కేంద్ర క్యాబినెట్ సమావేశాల్లో , పార్లమెంట్ లోనూ తెలంగాణ అంశాన్ని చాలా బలంగా ప్రస్తావించేవారని పేర్కొన్నారు . అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడానికి సంశయిస్తున్నదని గ్రహించి కేంద్ర మంత్రి పదవికి , ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారని , పలుమార్లు ఎమ్మెల్యేలతోనూ రాజీనామా చేయించడంతో రాజీనామా లు ఇంత సులువుగా చేస్తారా అనే అభిప్రాయం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించేదని వివరించారు . అసెంబ్లీ ని రద్దు చేసిన తర్వాత రాహుల్ గాంధీ దేశంలోనే పెద్ద బఫున్ అని పేర్కొంటూ కాంగ్రెస్ , బీజేపీ లతో పొత్తులు పెట్టుకునే ప్రసక్తే లేదని సినీ హీరో రజనీకాంత్ తరహాలో వ్యాఖ్యానించారని పేర్కొన్నారు . రాజకీయ విశ్లేషకులు కూడా కనీసం మరో పదేళ్లు కేసీఆర్ అధికారంలో ఉండే అవకాశం ఉందని నమ్ముతున్నట్లుగా బిజినెస్ స్టాండర్డ్ పత్రిక కాలమిస్ట్ అదితి ఫడ్నిస్ అభిప్రాయపడ్డారు .