జబర్దస్త్ కమెడియన్ గాలిపటాల సుధాకర్ గౌరవ డాక్టరేట్ కు ఎంపికయ్యాడు. తమిళనాడు కొయంబత్తూర్ రాయల్ అకాడమీ ఆర్ట్స్ యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఐదు వేల ప్రదర్శనలు ఇచ్చినందుకుగాను సుధాకర్ కు డాక్టరేట్ గుర్తింపు ప్రకటించింది.
ఈనెల (సెప్టెంబర్8)న దుబాయ్ లో జరుగనున్న ఓ కార్యక్రమంలో డాక్టరేట్ ను సుధాకర్ కు అందజేయనుంది యూనివర్సిటీ. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆర్టిస్ట్ సుధాకర్ జబర్దస్, పటాస్ టీవీ ప్రోగ్రామ్ లతో పాటు స్టేజ్ షోలు, ఇమిటేషన్ లద్వారా పేరు తెచ్చుకున్నారు. తన స్కిట్ లతో వైవిధ్యమైన హావభావాలతో అలరిస్తూ కామెడీ పండిస్తున్నాడు. గౌరవ డాక్టరేట్ ఎంపికైన సుధాకర్ కు పలువురు ఆర్టిస్టులు, ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.