బంగారు తెలంగాణ సాధనకు రాష్ట్ర ప్రజలు మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వానికే పట్టం కట్టాలని ఆపద్ధర్మ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆదివారం బాసర సరస్వతి అమ్మవారిని ఆపద్ధర్మ మంత్రి అల్లోల దంపతులు, మధోల్ టీఆర్ఎస్ అభ్యర్థి జి.విఠల్‌రెడ్డిలు దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు ముందు అన్ని పార్టీలు రాబోయే ఎన్నిక ల్లో మట్టికరుస్తాయన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ తెరాసా విజయం సా ధిస్తుందన్నారు. రమేష్ రాథోడ్ టీ ఆర్ఎస్లో ఉంటే కేసీఆర్ సముచిత న్యాయం కల్పించేవారని, ఇండిపెండెంట్‌గా పోటీచేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. మాకు ఏ పార్టీతో భయంలేదని, మాలో మాకు గ్రూపు తగాదాలు లేవన్నారు. టీడీపీ, కాంగ్రెస్ కలిస్తే చనిపోయి స్వర్గంలో ఉన్నా ఎన్టీఆర్ బాధపడతారన్నారు. అనైతిక పొత్తు వల్ల తెలంగాణలో ఒరిగేమీ లేదన్నారు. టీటీడీపీ ముందు నుండే రెండు కళ్ల సిద్దాంతంను పాటిస్తుందన్నారు. నిర్మల్‌జిల్లాలో టీటీడీపీ ఉనికి కోల్పోయిందన్నారు. ఆ పార్టీ నాయకులు టీఆర్ఎస్లోకి ఎప్పుడో వచ్చేశారన్నారు. కాంగ్రెస్‌పార్టీలో సరై న నాయకత్వం లేదు, ఆలోచన కూడా లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రంలో అభివృద్ది చేసిందని, మరోమారు టీఆర్ఎస్ కు అధికారం అప్పగించాలని ఓటర్లను కోరారు. తిరుపతి తరహాలో యాదాద్రికి వెయ్యి కోట్లు ఇచ్చి అభివృద్ది చే స్తున్నారని తెలిపారు.
Tags government improved telangana trs party