చెక్‌బౌన్సుల కేసులో తెలుగు నిర్మాత బండ్ల గణేష్ కడప జిల్లా ప్రొద్దుటూరు జిల్లా రెండో అదనపు కోర్టుకు శుక్రవారం హాజరయ్యారు. గత ఏడాది చెక్‌బౌన్సుల కేసులో గణేష్ దోషిగా నిర్ధారించారుప్రస్తుతం, తాజా కేసులో, స్థానికుల దాఖలు చేసిన వివిధ చెక్ బౌన్స్ కేసుల విచారణకు హాజరు కావడానికి ప్రొద్దుటూరు కోర్టు పిలుపునిచ్చింది.ఆయన ఉదయం ప్రొద్దుటూరుకు వచ్చి తన కారును జార్జిక్లబ్‌లో ఉంచి అక్కడినుంచి కోర్టులోకి వెళ్లారు.
ఫిర్యాదుదారుల సమక్షంలోనే బండ్ల గణేష్‌ను జడ్జి విచారించారు. అయితే గణేష్ న్యాయమూర్తిని కొంత టైం కావాలని కోరినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. బండ్ల గణేష్‌పై 68 చెక్‌బౌన్సు కేసులు ఉన్నాయి. ఇందులో శుక్రవారం 21 కేసుల విచారణకు ఆయన హాజరయ్యారు. మిగిలిన కేసులపై మొదటి ఏడీఎం ప్రదీప్‌కుమార్ విచారించారు. విచారణను అక్టోబరు తొమ్మిదో తేదీకి వాయిదా వేసినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. గణేష్ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించగా మాస్క్ ధరించి కోర్టు నుండి బయటకు వచ్చేసాడు.