ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు దక్కించుకున్నారనేది బహిరంగ వాస్తవమే.. ఆసమయంలో ఎన్టీఆర్ దారుణంగా చంద్రబాబును విమర్శించిన దాఖలాలూ ఉన్నాయి. అయితే అసెంబ్లీలో ఎన్టీఆర్ గురించి ఏం మాట్లాడారో అప్పుటివారికి చంద్రబాబు నైజం బాగా తెలుసు. అయితే చంద్రబాబు అసెంబ్లీలో ఎన్టీఆర్ ను ఉద్దేశించి ఏమన్నారో చూడండి..
1995 డిసెంబర్ 5న జరిగిన అసెంబ్లీ సమావేశంలో (ఎన్టీఆర్ను గద్దెదింపిన సందర్భంగా అసెంబ్లీలో, స్పీకర్ నివాసం వద్ద జరిగిన నిరసనలకు సంబంధించిన చర్చ సందర్భంగా) ఎన్టీఆర్ ప్రతిరోజూ నన్ను వెన్నుపోటుదారుడని మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ ఏ డెసిషన్ తీసుకుంటారో అని ప్రతిరోజూ టెన్షన్ గా ఉండేది. ఆయన ఏ డెసిషన్ తీసుకుంటారో మాకు తెలిసేది కాదు. 35మంది మంత్రులను ఒక్కసారిగా రిమూవ్ చేయడం… (అప్పట్లో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మొత్తం కేబినెట్ ను రద్దు చేశారు) ఆవిధంగా ఆయన ఎన్ని డెసిషన్స్ తీసుకున్నా మేమందరం సహకరించి ఎప్పటికప్పుడు ఆతప్పులను దిద్దుకుంటూ ముందుకు తీసుకుపోయాం.
5సంవత్సరాలు సుమారు 74 మంది ఎమ్మెల్యేలు ఇలా శ్రమపడ్డామో, ఏ విధంగా ఫైట్ చేసి తిరిగి అధికారంలోకి వచ్చామనేది అందరికీ తెలుసు. “ఒక వ్యక్తి బొమ్మ పెట్టుకొని గెలిచామనే మాట కాదు. ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంది”. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ప్రముఖులు, కార్యకర్తలు మొదలైన వారి కాంట్రిబ్యూషన్ ఉంది.
ఎన్టీఆర్ కు చరిష్మా ఉంటే 1989లో ఆయన ఎందుకు ఓడిపోయారని అడుగుతున్నా. 1983లో చూసినట్లయితే 200 సీట్లు గెలవడం జరిగింది. (1983లో చంద్రబాబు టీడీపీలో లేరు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు) 84 ఆగస్టు నెల క్రైసిస్ లో మిత్రపక్షాలు అందరూ కలిసి బీజేపీతో సహా 240 మంది గెలిచాం. తిరిగి 1994 లో జరిగిందేంటో అందరికీ తెలుసు. కాంగ్రెస్ 26 అయితే మిత్రపక్షాలతో కలిసి మేం 254 సీట్లు గెలిచాం. ఆ విధంగా ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ తో గెలిచాం. ఏ ఒక్కరితో కాదని తెలుపుతున్నాను.
ఈ సందర్భంగా అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుడు కె. బాపిరాజు జోక్యం చేసుకుని… ”బాబు ముఖ్యమంత్రి అయ్యారంటే ఆవిడ (లక్ష్మీపార్వతి) పుణ్యమా…” అని ప్రశ్నించగా… చంద్రబాబు స్పందిస్తూ… ”మీరు తెలుసుకున్న వాస్తవం కూడా ఎన్టీ రామారావు ఇంకా తెలుసుకోలేదు. నేను ఎప్పుడూ ముఖ్యమంత్రి పదవి కావాలని కోరుకోలేదు. కానీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిటాయని ఎమ్మెల్యేలంతా నామీద ఒత్తిడి తెచ్చినప్పుడు విధిలేని పరిస్థితుల్లో ఒప్పుకున్నాను. వెన్నుపోటు పొడిచే తత్వం నా రక్తంలో లేదు. ఆరోజు మేము పోరాడి చెప్పి చెప్పి విసిగిపోయి తిరుగుబాటు చేసాం..
ప్రజాస్వామ్యం… ప్రజాస్వామ్యం… అని (ఎన్టీఆర్) మాట్లాడితే నాకే అర్థం కావడం లేదు. అసలు ప్రజాస్వామ్యానికి డెఫినిషన్ ఏంటని అడుగుతున్నాను. ఎన్ టి రామారావు గారు ఏం చేశారంటే పార్టీ కాన్ స్టిట్యూషన్ రాసుకున్నామని అన్నారు. ఆయన ఎప్పుడు రాసుకున్నారో నాకు తెలియదు. శాశ్వతంగా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఆయన రాసుకున్నారు. మన కాన్ స్టిట్యూషన్ పర్మిట్ చేస్తే ఆయనే శాశ్వతంగా ముఖ్యమంత్రి అని రాసుకునే వారేమో నాకు తెలియదు కానీ… ఆయన (ఎన్టీఆర్) ఎన్ని శాపనార్థాలు పెట్టినా వాటిని ఆశీర్వచనాలుగానే నేను తీసుకుంటా. నేను ఎప్పుడూ తొందరపడే పరిస్థితి లేదు. డెస్పరేట్ మూడ్ లో ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు. ప్రజలు ఎక్కడ గుణపాఠం చెప్పాలో అక్కడ చెబుతారు. అది కూడా తొందరలోనే చూస్తారు…. ఇదీ ఎన్టీఆర్ గురించి చంద్రబాబు ఆనాడు అసెంబ్లీ వేదికగా అన్న మాటలు.
ఈ విషయాలను ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి బట్టబయలు చేసారు.