ఏపీలో సీనియర్ నేతలు వలసబాట పడుతున్నారు. ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉన్నందున ఏపీలో వలసలు ఊపందుకున్నాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి కుమారుడు రాంకుమార్‌రెడ్డి వైసీపీలో చేరిక ఎప్పుడనేది స్ఫష్టం అయ్యింది. రేపు ఆయన విశాఖపట్నంలో జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. పార్టీలో చేరిక సందర్భంగా వెంకటగిరి, గూడూరు నియోజక వర్గాల నుంచి నేదురుమల్లి కుటుంబ అభిమానులను విశాఖకు తీసుకెళ్లడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల నుంచి 200 ప్రత్యేక వాహనాలలో సుమారు 10 వేల మందితో తరలి వెళ్లి జగన్ సమక్షంతో వైసీపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. రేపు జగన్ పాదయాత్ర జన జాతరే అంటున్నారు వైసీపీ నేతలు. విశాఖ నగరంలో భారీ బహిరంగా సభ కూడ పెట్టనున్నారు.
