ప్రగతినివేదన సభ నాటినుంచీ టీఆర్ ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఈలోపే గులాబీ బాస్ కేసీఆర్ చేసిన ముందస్త ఎన్నికల ప్రకటనతో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. పార్టీ అభ్యర్ధులను సైతం కేసీఆర్ ప్రకటించడం పట్ల ఆపార్టీ ఎన్నికలకు సిద్ధమైందనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో టీఆర్ ఎస్ లోకి చేరికలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు స్పీకర్ గా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సురేష్ రెడ్డి కారెక్కేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. సురేష్ రెడ్డితో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. సురేష్ రెడ్డి టీఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. శుక్రవారం సురేష్ రెడ్డితో కేటీఆర్ సమావేశం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకొంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఆరుగురు నేతలు కూడ టీఆర్ఎస్ లో చేరేందుకు మంతనాలు జరుపుతున్నారని సమాచారం.
చాలా కాలంగా సురేష్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరేందుకు ప్లాన్ చేసుకొంటున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే సురేష్ రెడ్డి గతంలో ఆర్మూర్ రెడ్డి పోటీ చేశారు. అయితే ప్రస్తుతం ఈ స్థానం నుండి జీవన్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. అధిష్టానం పూర్తి క్లారిటీతో వెళ్తున్న నేపధ్యంలో సురేష్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరితే ఆయనకు ఏస్థానం నుండి పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తారనేది ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.ఆర్మూర్ స్థానం కావాలని సురేష్ రెడ్డి పట్టుబడితే జీవన్ రెడ్డిని తప్పించి సురేష్ రెడ్డికి టిక్కెట్టు ఇస్తారా.. లేదా ఇతర స్థానం నుండి ఆయనకు చోటు కల్పిస్తారా అనేది ఆసక్తి నెలకొంది. సురేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టంగానే చెప్పొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేటీఆర్ ఆహ్వానంమేరకు సురేష్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
Tags kcr suresh reddy telangana