పశ్చిమ గోదావరిజిల్లాలో అత్యంత కీలకమైన, వివాదాస్పద నియోజకవర్గం దెందులూరు.. ప్రస్తుతం దెందులూరులో అధికార తెలుగుదేశం పార్టీకి ఎదురుగాలి వీస్తోంద. ఇక్కడి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర చౌదరి వైఖరి, దందాలు, సెటిల్మెంట్లు, దాడులు, బూతులు మితిమీరుతు న్నాయని, ఈయన ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటూ బేరాలాడుతున్నాడని తెలుస్తోంది. మొత్తంగా ఈపరిణామం పార్టీని బజారున పడేస్తోందట. పేదలు,మధ్య తరగతి వర్గాలని కూడా చూడకుండా దోచుకోవడమే పనిగా వ్యవహరిస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార గర్వంతో గతంలో ఎమ్మార్వో వనజాక్షిని కొట్టడం, బస్సులను ఆపినందుకు ప్రశ్నించిన సిబ్బందిని కొట్టడం వంటివి చేసాడు. చంద్రబాబు చింతమనేని విషయంలో ఏవైనా వివాదాలకు పాల్పడినపుడు వార్నింగ్ ఇచ్చినట్టు కలరింగ్ ఇస్తుంటారని, లోపలమాత్రం ఆయనంటే చాలా ఇష్టపడతారట. ఇలాంటి ఎమ్మెల్యేలే మనకు కావాలని ప్రశంసిస్తుంటారట.. అందుకే చింతమనేని ఆగడాలకు అంతూ పొంతూ లేదు. ఈ క్రమంలో నియోజకవర్గంలో బలమైన ప్రతిపక్షం లేకపోవడంతో చింతమనేని అరాచకాలు భరించిన జనాలు సరైన లీడర్ కోసం వెయిట్ చేశారు. అయితే సరిగ్గా ప్రముఖ విద్యావేత్త కొఠారు అబ్బయ్య చౌదరి దెందులూరు వైసీపీ ఇన్ చార్జ్ గా చార్జ్ తీసుకున్నారు. దీంతో అబ్బయ్య చౌదరికి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ప్రజలంతా ఒక్కటై అబ్బయ్య వెంట నడుస్తున్నారు. అబ్బయ్య కూడా అందరితో కలిసిపోతూ ఒక్క ఫోన్ కాల్ కే అందరికీ అందుబాటులోకి వస్తున్నారు. టీడీపీ కంచుకోట అయిన దెందులూరు వంటి వివాదాస్పద నియోజకవర్గంలో ప్రజలు బాహాటంగా వైసీపీకి మద్దతు పలకడం ఇదే తొలిసారి. ఇప్పటివరకూ చింతమనేని ఆగడాలకు భయపడి ఎవరూ నోరు మెదపని పరిస్థితితో నేనున్నానంటూ అబయ్యచౌదరి రావడం, ప్రజలకు అండగా నిలబడడంతో ప్రతీఒక్కరూ ఇప్పుడు అబ్యయ్యకు జై కొడుతున్నారు. అబ్బయ్య దెబ్బ.. చింతమనేని అబ్బా అంటూ మద్దతిస్తున్నారు. కచ్చితంగా ఇంకోసారి చింతమనేని వంటి గూండాను గెలిపించబోమంటున్నారు దెందులూరు నియోజకవర్గ ప్రజలు. అబ్బయ్య చౌదరి కూడా ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతున్నారు. దెందులూరు గడ్డపై వైసీపీ జెండా ఎగురవేస్తానని, చింతమనేనిని ఎంటర్ కానివ్వనని చెప్తున్నారు. ప్రస్తుతం దెందులూరులో వైసీపీ మంచి జోష్ మీద ఉంది. చింతమనేని ఆగడాలతో విసుగెత్తిన ప్రజలు అబ్బయ్యచౌదరికి పట్టం కట్టేందుకు సిద్ధమవుతున్నారు.
Home / 18+ / దెందులూరులో తాజా పరిస్థితి.? వివాదాస్పద సెగ్మెంట్ లో పార్టీకోసం అబ్బయ్యచౌదరి ఏం చేస్తున్నాడు.? ఇంకోసారి చింతమనేని గెలిస్తే
Tags chinthamaneni prabhakar tdp