కర్నూల్ జిల్లాలో టీడీపీ నేతలు ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. తాజాగా కోడుమూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ డి.విష్ణువర్ధన్‌రెడ్డికి గట్టిషాక్ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు తొలిషాపురం పల్లె ఎల్లారెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, కోడుమూరు సమన్వయ కర్త మురళీకృష్ణ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ.. కోడుమూరు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట అన్నారు. గత ఎన్నికల్లో జిల్లాలోనే అత్యధికంగా 50 వేలకు పైగా మెజార్టీతో వైసీపీ అభ్యర్థిగా మణిగాంధీ గెలుపొందారన్నారు. ఆయన డబ్బుకు అమ్ముడబోయి టీడీపీలో చేరారని, అయినా పార్టీ క్యాడర్ మాత్రం వైసీపీలోనే ఉందని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో వైసీపీకి విజయానికి కోడుమూరు నియోజకవర్గమే నాంది పలకునుందని జోస్యం చెప్పారు. గతంలో కంటే మరో పదివేల మెజార్టీ అధికంగా వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో బలంగా ఉన్న వైసీపీకి ఎల్లారెడ్డి చేరికతో అదనపు బలం చేకూరిందని సమన్వయ కర్త మురళీకృష్ణ అన్నారు. వైఎస్ జగన్ ని ఏపీ ముఖ్యమంత్రిగా చేసేందుకు తనవంతు సహకారం అందించాలనే కోరికతో వైసీపీలో చేరినట్లు ఎల్లారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కె.మహబూబ్‌బాషా, పస్పల వెంటరాముడు, ఆర్.కొంతలపాడు శ్రీనివాసరెడ్డి, సీబెళగల్ డి.విక్రమ్‌కుమార్, ఎం.ముల్లా హకున్, బి,తాండ్రపాడు మాజీ వైఎస్‌సర్పంచ్ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.