చంద్రబాబు బుధవారం తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్రలోని భాజపా సర్కారు ఏ రకంగా తమను మోసం చేసిందో వివరించారు.కేంద్రంలోని మోడీని విలన్ గా తాను ఎస్టాబ్లిష్ చేశారు.
ఇదంతా ఇలా ఉంటే.. ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా కొత్త ఆలోచనలు చెప్పారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఎవరైనా మరణిస్తే.. మునిసిపాలిటీ వారు వారి దగ్గరనుంచి కొంత రుసుము తీసుకుని.. శవయాత్ర పూర్తయిన వెంటనే మీద చల్లిన పూలు రోడ్డు మీద పడి ఉండగా వాటిని శుభ్రం చేసేస్తారట. ఈ అయిడియా చంద్రబాబుకు తెగ నచ్చినట్టుంది,అలాంటి కొత్త కొత్త ఆలోచనలు రావాలంటూ పిలుపునిచ్చారు.
చంద్రబాబు త్వరలోనే శవాలమీద కూడా బిజినెస్ చేయడానికి సిద్దమయ్యారు.శవయాత్ర జరిగితే.. రుసుము కట్టకపోతే.. శవం మీద చల్లిన పూలు తీసేయరా? ఎన్ని పూలు శవం మీద చల్లితే ఎంత రుసుము కట్టాలి? కొద్ది పూలు మాత్రమే చల్లుకునే పేదలు కూడా రుసుము కట్టాల్సిందేనా? చంద్ర బాబు ప్రభుత్వం అవినీతి లో నెంబర్ 1 అని ఇప్పటికే నీతి ఆయోగ్ తేల్చి పారేసింది. అయినా చంద్ర బాబు పారదర్శక ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని చెబుతుంటాడు.
అయితే ఈ వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదమవుతున్నాయి. ఒక ముఖ్యమంత్రి ఎవరైనా ప్రజలు చనిపోయినపుడు ఆకుటుంబానికి అండగా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలు గురించి ఆలోచించాలి గానీ దారుణంగా ఆ శవాలపైనా వ్యాపారం చేసి ఆదాయం సంపాదించేలా ఆలోచించడం పట్ల నెటిజన్లు విరుచుకుపడున్నారు. చంద్రబాబు నీచమైన ఆలోచనలు మానుకోవాలి.