మాజీ డిజిపి సాంబశివరావు ఓ వ్యూహంతో ముందుకెళుతున్నట్టు తెలుస్తోంది. పార్టీల అధినేతలతో ఆయన సమావేశాలు జరుపుతున్న తీరుతో అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావుతో సాంబశివరావు భేటీ కావడం అందరిలోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయ్. డీజీపీ ఉద్యోగ విరమణ తర్వాత మాజీ డిజిపిని గంగవరం పోర్టు ఛైర్మన్ గా చంద్రబాబు నియమించారు. ఈ క్రమంలో పాదయాత్రలో ఉన్న జగన్ ను కలిసి 20నిమిషాలు చర్చించడం చర్చనీయాంశమైంది. ఈలోపే తమ పార్టీలోకి సాంబశివరావు వస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించగా ఆయనే మళ్లీ తాను వైసీపీలో చేరడం లేదని చెప్పడం సంచలనమైంది. అయితే రానున్న ఎన్నికల్లో ఒంగోలు ఎంఎల్ఏ లేదా ఎంపిగా వైసిపి తరపున పోటీ చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. దాంతో టిడిపి నేతలు ఒక్కసారిగా ఉల్లిక్కిపడ్డారు. వెంటనే చంద్రబాబుతో భేటీకి ఏర్పాటు చేశారు. గంటాకూడా ఈరోజో, రేపో టిడిపిని వదిలేసి జనసేనలో చేరుతారనే ప్రచారం కూడా జరుగుతుంది. దీంతో గంటా, మాజీ డీజీపీ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావటంతోనే మళ్లీ గంటా-మాజీ డిజిపి భేటీపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. వీరిద్దరూ రాజకీయంగా కలిసి నడవాలనే ఆలోచనలో ఉన్నట్టు మాత్రం స్పష్టంగా అర్ధమవుతోంది. అయితే కొందరు మాత్రం వీరిద్దరూ జనసేనలోకి వెళ్తారంటుంటే మరికొందరు మాత్రం వైసీపీలోకి వెళ్తారని చెప్తున్నారు. అయితే ఒక్కటిమాత్రం నిజం గంటా మాజీ డీజీపీల రాజకీయ భవిష్యత్ భేటీ జరిగితే కచ్చితంగా వైసీపీలోకి వస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి. కారణం గంటా ఇప్పటివరకూ మారిన ప్రతీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే మంత్రిపదవి కూడా అందుకున్నారు. దీనినిబట్టి కచ్చితంగా కంటా పార్టీ అంటూ మారితే మరో కీలక మంత్రిపదవితో వైసీపీలోకి వస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి.