పాత కరెన్సీ స్థానంలో రూ.2 వేల నోటు, కొత్త రూ.500, రూ.10, రూ.50,రూ.200 నోట్లతో పాటు రూ.100ల నోటు కూడా చెలామణిలోకి వచ్చింది. వినియోగ దారుడికి కాస్త చిల్లర వెసులుబాటుకు వీలవుతుంది. ఈనెల 1నుంచి కొత్త 100 నోటు అమల్లోకి వచ్చాయి. నోటు ముందు భాగంలో గాంధీ బొమ్మ, వెనుకవైపు రాణికీ వాస్ ముద్రించి ఉన్న ఈ నోటు వంగపూవు రంగులో ఉంది. 142 ఎంఎం పొడవు, 66 ఎంఎం వెడల్పుతో దీన్ని తయారు చేసినట్లు రిజర్వ్ బ్యాంకు పేర్కొంది. గాంధీతో పాటు అశోకుడి నాలుగు సింహాలు, వాటర్ మార్క్, స్వచ్ఛ భారత్ లోగో వంటివి ఈ నోటుపై ఉంటాయి. దీనితో పాటుగా పాత రూ.100 నోటు కూడా చెలామణిలో ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.
Tags India new 100rs notes
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023