ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్నం జిల్లా మాడగుల నియోజకవర్గంలోని కె కోటపాడులో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తూ వైఎస్‌ఆర్ హయాంలో కోట్ల రూపాయల లాభాల్లో ఉన్న చోడవరం చక్కెర ఫ్యాక్టరీని చంద్రబాబు హయంలో 45వేల కోట్ల అప్పుల్లోకి తీసుకెళ్ళిన నేత అని,ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విమర్శించారు. చోడవరం చక్కెర ఫ్యాక్టరీపై సుమారు 25వేలకు పైగా కార్మికులు ఆధారపడతున్నారని, చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఆయన విధానాల కారణంగానే ఈ ఫ్యాక్టరీ తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయిందని ఆయన మండిపడ్డారు.
2003 వరకు నష్టాల భారిన పడిన చక్కెర ప్యాక్టరీని వైఎస్‌ఆర్ అధికారంలోకి వచ్చాక లాభాల బాటలో నడిపించారని ఆయన గుర్తుచేశారు. అయితే చంద్రబాబు 2014లో సీఎం అయ్యాక పూర్తిగా నష్టాల్లోకి తీసుకెళ్లారు. కేవలం నాలుగేళ్ల కాలంలో వేలకోట్ల నష్టాల్లోకి చక్కెర ఫ్యాక్టరీని తీసుకెళ్లారు. ఇక్కడ తయారు చేసే మోలాసిస్ కేవలం ఆరువందలకు ప్రభుత్వం కొని వారి బినామీలకు రెండు వేలకు అమ్ముకుంటున్నారు.మాడగుల నియోజకవర్గానికి ఆయుపట్టుగా ఉన్న రైవాడ రిజర్వాయర్ నీటిని విశాఖకు తరలిస్తున్నారు. దాంతో ఇక్కడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ఆ నీటిని విశాఖకు తరలించి.. రైవాడ రిజర్వాయర్ నీటిని పూర్తిగా ఈ ప్రాంతానికే కేటాయించవచ్చు. కానీ చంద్రబాబు ఉంటే ప్రాజెక్టు పూర్తి కాదాని ఆయన విమర్శించారు.