Home / SLIDER / తుమ్మల అపర భగీరథుడు ..ఖమ్మం జిల్లా ప్రజల అదృష్టం ..

తుమ్మల అపర భగీరథుడు ..ఖమ్మం జిల్లా ప్రజల అదృష్టం ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న గురువారం సూర్యాపేట జిల్లాలో పర్యటించిన సంగతి తెల్సిందే .ఈ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా నూతన కలెక్టర్ ,పోలీస్ శాఖ భవనాల నిర్మాణ పనుల శంఖుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు .

తదనంతరం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రగతి సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ “మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు అపర భగీరథుడు ..మొత్తం పది నెలల పాటు రాత్రి అనక పగలు అనక కష్టపడి పాలేరు ప్రజల ముప్పై యేండ్ల సమస్యను పరిష్కరిస్తూ వాళ్ళ దాహార్తిని తీర్చే భక్తరామదాసు ప్రాజెక్టును పూర్తిచేయించాడు అని ప్రశంసలు కురిపించారు .

ఇంత మంచి కమిట్మెంట్ నాయకుడు ఉండటం ఖమ్మం ప్రజల అదృష్టం అని అన్నారు .మంత్రి తుమ్మలకు కృష్ణ నీళ్ళు అవసరంలేదు ..సీతారామ ప్రాజెక్టు కింద జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నారని ఆయన అన్నారు ..అయన నాయకత్వంలో ఖమ్మం జిల్లా దేశంలోనే సంపన్న జిల్లా అవుతుంది అని అన్నారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat