భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలమైన కేరళకు చాలామంది విరాళాలు ఇచ్చారని వాళ్ళకి సీఎం పినరయి విజయన్ రాష్ట్రం తరుపున కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ మేరకు ఆ రాష్ట్ర ఆయన ఓ ప్రకటన చేశారు. కేరళకు రూ .700 కోట్ల యుఏఈ సహయం ప్రతిపాదనకు కేంద్రం తిరస్కరించిన విషయం అందరికి తెలిసినదే.కాని యూఏఈ నుంచి సహాయం అందుతుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
వరదల సమయంలో అత్యంత ప్రతిభ కనబరిచిన ఐఏఎస్ అధికారులను ఆయన అభినందించేందుకు ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొన్నారు. వరదలు, భారీ వర్షాల నుంచి ప్రజలను కాపాడటంతో అధికారులు ప్రాణలకు తెగించి విధులు నిర్వహించారని సంతోషం వ్యక్తంచేశారు. యూఏఈ సహాయం విషయంలో కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుంటుందని కేరళ సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ఆదుకోవటానికి కేంద్ర చేసిన సాయం పూర్తిగా అందలేదని, నష్టాన్ని పూడ్చేందుకు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరిందని విజయన్ గుర్తు చేశారు. కేరళ వరదల్లో 483 మంది మృతి చెందారని… గల్లంతైన 14 మంది ఆచూకి ఇప్పటీకి లభించలేదని సీఎం తెలిపారు.