టీమిండియా మూడో టెస్టులో పుంజుకున్న గ్రాండ్ విక్టరీతో సిరీస్ ఓటమి అంచుల నుంచి తప్పించుకుంది. సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో ఉన్న టీమిండియా గురువారం ఆరంభమయ్యే నాలుగో టెస్టులో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. మొదటి టెస్టులో 31 పరుగుల తేడాతో ఓడిన కోహ్లీ సేన.. లార్డ్స్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తేడాతో పరాజయం చవిచూడడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కున్న విషయం అందరికి తెలిసిందే.అయితే అభిమానులు కూడా సిరీ్‌సపై ఆశలు వదిలేసుకున్నారు. కానీ, నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో సమష్టిగా చెలరేగిన భారత్ 203 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.ఇక ఈరోజు నుండి జరగబోయే మ్యాచ్ లో మనవాళ్ళ అదరహో అనిపించ్చుకొని మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేస్తారా లేదా నిరాశకు గురుచేస్తారా అనేది వేచి చూడాల్సిందే .