– భారత్, కంగారుల మధ్య టఫ్ ఫైట్ నేడు
భారత్, ఆస్ట్రేలియా మధ్య మరి కొద్ది గంటల్లో జరగనున్న మూడో టీ20 మ్యాచ్ కు హైదరాబాద్ నగర పరిధిలోగల రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికవ్వబోతున్నది. మరి కొద్ది గంటల్లో భారత్,ఆస్ట్రేలియాల మధ్య హోరాహోరీగా పోరు జరగనున్నది. రెండు టీములకూ నేడు (శుక్రవారం) జరిగే మ్యాచ్ చావో రేవో అన్నవిధంగా మారింది. అయితే ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 1, ఆస్ట్రేలియా 1 గెలిచి సమాన స్థాయిలో ఉన్నాయి. ఈ సిరీస్‌లో గెలుపెవరిదోనన్న సస్పెన్స్‌కు తెరప డాలంటే మరి కొద్ది గంటల్లో ఉప్పల్‌లో జరగనున్న మూడో టీ20 మ్యాచ్ ముగిసే వరకు ఉత్కరఠ భరించక తప్పదు. అయితే ఇప్పటిదాకా ఆస్ట్రేలియాపై ఆడిన టీ20 మ్యాచుల్లో భారత్‌దే పైచేయిగా నిలవడం అభిమానులకు ఊరటనిచ్చే అంశం.
వరుణుడు కరుణించేనా!
ఉప్పల్ స్టేడియంలో జరగనున్న భారత్, ఆస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్‌లో సిరీస్‌లో విజేత ఎవరో తేలిపోతుంది. దీంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉండడం ఇరు జట్లనూ ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి కారణం గత వారం రోజుల నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడమే. అంతేకాక, శుక్రవారం కూడా ఇక్కడ వాన వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి వెల్లడించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) మ్యాచ్ నిర్వహణకు సిద్ధమైంది. అయితే, ఇటీ వల కురుస్తున్న వర్షాలకు పిచ్ పాడుకాలేదని క్యూరేటర్ వైఎల్ చంద్రశేఖర్ తెలపడం గమనార్హం.