తెలంగాణ ప్రజలే టీఆర్‌ఎస్ కు హైకమాండ్ అని రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. సెప్టెంబర్ 2వ తేదీన కొంగర కలాన్ లో జరగబోయే టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను, ప్రధాన వేదిక నిర్మాణాన్ని మంత్రులు నాయిని, కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..హైదరాబాద్ కొంగర కలాన్ లో వచ్చే నెల 2న అసాధారణమైన స్థాయిలో ప్రగతి నివేదన సభ జరగబోతోందని…ఎన్నికలు ఎప్పుడు జరిగినా వందకు పైగా సీట్లు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.సభ జరిగే సెప్టెంబర్ 2వ తేదీన ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు పెద్ద సంఖ్యలో సభ కోసం అద్దెకు తీసుకుంటున్నామని, ప్రజలు వీలైతే ఆ రోజు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చినమని మంత్రి కేటీఆర్ చెప్పారు. హామీ ఇవ్వకున్నా అనేక కొత్త పథకాలను అమలు చేస్తున్నామన్నారు.