ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ చరిత్రలో ఫైనల్‌కు చేరిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డులకెక్కిన పీవీ సింధు.. ఫైనల్ పోరులో తడబడింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తుది పోరులో సింధు 13-21, 16-21 తేడాతో వరల్డ్ నంబర్ వన్ క్రీడాకారిణి తై జు యింగ్(చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలై రన్నరప్‌గా సరిపెట్టుకుంది. ఏకపక్షంగా సాగిన పోరులో సింధు పూర్తిస్థాయి ఆటను కనబరచడంలో విఫలమైంది.
వరుస రెండు సెట్లను ఓడిపోయినా సింధు.. మరొకసారి ఫైనల్ ఫోబియాను అధిగమించలేకపోయింది. తద్వారా 2016 రియో ఒలింపిక్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో చివరిసారి తై జు యింగ్‌ని ఓడించిన సింధు ఆ తర్వాత ఆమెతో ఆడిన వరుస ఆరు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైనట్లయ్యింది.అయితే వీరిద్దరి మద్యన 12మ్యాచ్ లు జరగగా ఇందులో తై జు యింగ్ 9మ్యాచ్ లు గెలుచుకుంది.
కాగా, ఏషియన్ గేమ్స్ సింగిల్స్ విభాగంలో రజత పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు గుర్తింపు సాధించింది.ఆసియా క్రీడా బ్యాడ్మింటన్ చరిత్రలో భారత్ ఇప్పటివరకూ ఒకే ఒక్క సింగిల్స్ పతకం ఉంది. 1982లో ఢిల్లీలో నిర్వహించిన ఆసియా క్రీడల్లో పురుషుల సింగిల్స్‌లో సయ్యద్ మోదీ కాంస్య గెలిచాడు. ఆ తర్వాత సింగిల్స్‌లో భారత్‌కు ఒక్క పతకం కూడా రాకపోగా, తాజా ఏషియన్ గేమ్స్‌లో సింధు రజత పతకాన్ని సాధించగా, సైనా కాంస్యాన్ని సాధించింది.
Tags jakaartha pv sindhu silver medal