Home / 18+ / గుంటూరులో తెలుగుదేశం నారా హమారా ఎందుకో తెలుసా.?

గుంటూరులో తెలుగుదేశం నారా హమారా ఎందుకో తెలుసా.?

నారా హమారా-టీడీపీ హమారా ఇవాళ గుంటూరులో ముస్లింలతో టీడీపీ భారీ సభ నిర్వహిస్తోంది. ఈ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముస్లిం పెద్దలు పాల్గొననున్నారు. ఈ నారా హమారా టిడిపి హమారా ముస్లిం మైనార్టీ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేసారు. మంత్రులు కళావెంకట్రావు,నక్కా ఆనందబాబు, అయ్యన్నపాత్రుడు, ప్రత్తిపాటి పుల్లారావులు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మైనార్టీలను ప్రత్యేకంగా చూసి వారి అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేస్తున్నామని చెప్పుకోవడానికి, రాష్ట్రంలో ముస్లింలకు టీడీపీపై ఉన్న వ్యతిరేకత పోగొట్టుకోవడానికి ఈ సభ నిర్వహిస్తున్నారట. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయిన తర్వాత కడపలో హజ్ భవనం, కాకినాడలో ఉర్థు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించనున్నారట. మోడీ ఢీ కొంటున్న చంద్రబాబు పోరాటానికి ముస్లిం లు మద్దతు కోరడానికి, ఈ నాలుగేళ్లలో చేయని అభివృద్ధి మరో ఆరునెలల్లో చేయబోతున్నాం అని చెప్పడానికి కోట్ల రూపాయల ప్రజాధనంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat