ఆసియా గేమ్స్ బ్యాడ్మింటన్ ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో ఫైనల్ కు చేరిన సింధు.నిన్న జరిగిన సెమీఫైనల్లో జపాన్‌కు చెందిన యమగుచిపై 21-17, 15-21, 21-10 తేడాతో సింధు ఘన విజయం సాధించింది. దీంతో భారత్‌కు సిల్వర్ మెడల్ ఖాయం చేసింది. ఆసియా గేమ్స్ లో బ్యాడ్మింటన్ ఉమెన్ సింగిల్స్ ఫైనల్ చేరిన తొలి భారతీయ షట్లర్‌గా సింధు నిలిచింది.ఇక ఫైనల్ లో గెలిచి చరిత్ర సృష్టిస్తుందో లేదో అనేది ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్న. సెమీస్‌లో సైనాను ఓడించిన వరల్డ్ నంబర్ వన్, టాప్ సీడ్ తై జు యింగ్‌తో సింధు తలపడనుంది. సెమీస్‌లో గెలవడానికి సింధు చెమటోడ్చాల్సి వచ్చింది. . ఫైనల్లో గెలిస్తే భారత్ పంట పండినట్టే. ఓడిపోయినా.. సిల్వర్ మెడల్ సింధు సొంతమవుతుంది. గెలిస్తే మాత్రం కొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఈసారైనా ఫైనల్ ఫోబియా నుంచి గట్టెక్కుతుందేమో చూడాలి మరి.ప్రస్తుతం అందరి ద్రుష్టి సింధు పైనే ఉంది.