తెలంగాణ రాష్ట్రంలో పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందని..పార్టీ కార్యకర్తలను పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి అండగా ఉండి..కాపాడుకుంటాం అని మంత్రి హరీష్ రావు అన్నారు.. పార్టీలో సభ్యత్వం పొంది ప్రమాదవశాత్తు చనిపోతే పార్టీ పక్షాన ఇన్సూరెన్స్ చేసి రూ. 2 లక్షల ప్రమాద బీమా పార్టీ పక్షాన ఇస్తుంది ..
సిద్దిపేట నియోజకవర్గంలో గతంలో 18మంది కార్యకర్తల కుటుంబాలకు అందించామని కొత్తగా ఇద్దరి కార్యకర్తలకు ప్రమాద బీమా మంజూరు అయిందన్నారు..ఇటీవల చిన్నకోడూరు మండలం చెర్ల అంకిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన దానాబోయిన లక్ష్మీ బైక్ మీదుగా వెళుతుండగా ట్రాక్టర్ ఢీకొని మృతి చెందింది.
దీంతో ఆమెకు పార్టీ ఇన్సూరెన్స్ చేపించి రూ. 2లక్షల బీమా మంజూరు చేయడం జరిగింది.. ఈరోజు బాధిత కుటుంబానికి చెక్కుని అందజేయడం జరిగిందని ఆయన అన్నారు…