మాజీమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశంజిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసులు రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. బాలినేని ఓ స్థానికంగా నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఒంగోలు వెళ్తునన్న సమయంలో ఒంగోలు సమీపంలోని త్రోవగుంటకు రాగానే దగ్గర బాలినేని ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా టైరు బరస్ట్ అయింది. వేగంగా వెళ్తున్న కారు టైరు పాడవడంతో కారు అదుపు తప్పబోయింది. డ్రైవర్ అప్రమత్తతతో కారును అదుపు చేసాడు. దీంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సమయంలో బాలినేనితో పాటు సాథానిక వైఎస్సార్సీపీ నాయకులు ఉన్నారు.
