గత ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్ 11 న టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం 10 జిల్లాల తెలంగాణను 31 జిల్లాల తెలంగాణగా విభజించింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలన క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేరింది. అయితే జిల్లాల పునర్విభజనను టీటీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు..రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని 5 మండలాలను వేరే జిల్లాలో కలిపింది..ఆ కోపం ఆయనకు ఇంకా చల్లారనట్లుంది.. కొత్త జిల్లాలు ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా అన్ని జిల్లాలలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనాలకు, ఇతర కార్యాలయాలు, పలు అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్‌తో సహా మంత్రులు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఈ నేపథ‌్యంలో జిల్లాల పునర్విభజనపై రేవంత్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు స్పందించారు. జిల్లాల పునర్విభజనతో ప్రజలకు అన్యాయం జరిగిందని రేవంత్ అన్నారు. కొత్త జిల్లాలపై మంత్రివర్గ ఉప సంఘం లేఖలను పట్టించుకోకుండా వ్యవహరించడంతో పాలన అస్తవ్యస్తం అయిందని రేవంత్ చెప్పుకొచ్చాడు. తన కొడంగల్ నియోజకవర్గంలోని 5 మండలాలను విభజించవద్దని చెప్పినా ముక్కలు చేసి వేరే జిల్లాలో కలిపారని రేవంత్ వాపోయాడు. అయితే రేవంత్ వ్యాఖ్యలపై ప్రజలు విస్మయం చేస్తున్నారు. జిల్లాల పునర్విభజనలో అందరిని సంతృప్తి పరచడం కష్టం..అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల మనోభావాలను గుర్తించి జిల్లాల సంఖ్యను పెంచిందని..కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు దూరభారం తగ్గిందని, అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారని , మారుమూల గ్రామాలకు కూడా పాలన చేరిందని ప్రజలు ప్రశంసిస్తున్నారు..అయితే ఏడాది తర్వాత ఇప్పుడు కొత్త జిల్లాలతో ప్రజలకు అన్యాయం జరిగిందని పాత పాట పాడడం రేవంత్ అవివేకం అని..కేవలం కొడంగల్‌ను విభజించారన్న కోపంతోనే
కొత్త జిల్లాల వల్ల ప్రజలకు అన్యాయం జరిగిందని, అధికారంలోకి వస్తే కొత్త జిల్లాలను రద్దు చేస్తాం అని పిచ్చివాగుడు వాగుతున్నాడని టీఆర్ఎస్ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి..కొత్త జిల్లాల కోసం ఇప్పటికీ ములుగు, మిర్యాలగూడ ప్రజల నుంచి డిమాండ్‌లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ‌్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై రేవంత్ విమర్శలు అర్థరహితం అనే చెప్పాలి.