పాకిస్తాన్‌కు కొత్త ప్రధాని నేడు ప్రమాణ స్వీకారం చేశారు. పాకిస్తాన్ 22వ ప్రధానమంత్రిగా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. పాక్ అధ్యక్షుడు మమ్‌నూన్ హుస్సేన్ నూతన ప్రధానమంత్రితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు, మాజీ ఇండియన్ క్రికెటర్ సిక్ష్క్షెర్ల వీరుడు నవజోత్ సింగ్ సిద్ధూతో పాటుగా కొంతమంది స్నేహితులు మాత్రమే హజారయ్యారు.జూలై 25న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) 116 స్థానాల్లో విజయం సాధించిన అతిపెద్ద పార్టీ గా నిలిచింది. సాధారణ ఎన్నికల అనంతరం నేషనల్ అసెంబ్లీ సభ్యులతో ప్రధాని రేస్ లోన్ ఉన్న అభ్యర్థిని ఎన్నికుంటారు. మేరకు జాతీయ అసెంబ్లీలో జరిగిన ఎన్నికల్లో ఈ మాజీ క్రికెటర్ 176 ఓట్లు రాగా, షాబాజ్ షరీఫ్‌కు 96 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ ఇమ్రాన్ ఖాన్‌ను ప్రధానిగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది. ఇమ్రాన్ నేతృత్వంలోనే పాకిస్తాన్ 1992లలో ప్రత్యర్దులని మట్టికరిపించి వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది. ఇమ్రాన్‌ఖాన్ లాహోర్‌లో 1952లో ఉన్నత మధ్యతరగతి పష్టున్ కుటుంబంలో జన్మించారు. ఇతని చదువు ఇంగ్లాండ్ లో ఆక్స్ఫర్డ్ లోని కేబుల్ కళాశాలలో కొనసాగించారు.చిన్నతనం లోనే ఇతడు క్రికెట్ ఆడడం ప్రారంభించాడు. మొదట కాలేజీ,ఆ తర్వాత 18 ఏళ్ల వయసులో జాతీయ టీమ్‌లో పాలుపంచుకున్నారు.రెండు దశాబ్దాలు పాక్ టీంలో ఆడారు.1982 నుంచి 1992 వరకు పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌కు కెప్టెన్‌గా చేశారు. ఒక క్రికెటర్ స్థాయి నుంచి ప్రధానిగా ఎదిగాడు ఇమ్రాన్ ఖాన్