ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఈక్రమంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగను అని ఏకంగా ప్రకటించేశారు. గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ సర్కారు చేస్తున్న పలు అవినీతి అక్రమాలతో పాటుగా విభజన చట్టంలో హామీలైన ప్రత్యేక హోదా,విశాఖకు రైల్వే జోన్ లాంటి హామీలను కేంద్ర ప్రభుత్వం చేత నేరవెర్చడంలో విఫలమవ్వడంతో ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగితే ఓటమి ఖాయమని భావించిన టీడీపీ ఎమ్మెల్యే లు తమ వారసులను బరిలోకి దించాలని ఆలోచనలో పడ్డారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాస అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర శివాజీ వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగను అని సంచాలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.
అంతే కాకుండా రానున్న ఎన్నికల్లో తనకు బదులు తన వారసురాలైన శిరీషకు అవకాశమివ్వాలని ఆయన ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడ్ని కోరారు అంట.. అయితే టీడీపీ అధినేత ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి..