మాజీ ప్రధాని వాజ్ పేయి ఆరోగ్యం సీరియస్‌గా మారింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన్ను ప్రధాని మోడీ పరామర్శించారు. వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయి జూన్ 12 ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు. ఆయన ఆరోగ్యం బుధవారం మధ్యాహ్నం నుంచి మరింత విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.వాజ్ పేయి ఆరోగ్యం విషమించిందని తెలియడంతో బీజేపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా వాజ్ పేయిని పరామర్శించారు. ఇదిలాఉండగా…వాజ్‌పేయి హెల్త్ కండీషన్ సీరియస్ గా ఉండటంతో బీజేపీ ఇప్పటికే తన అధికారిక కార్యక్రమాలన్నీ రద్ధు చేసుకుంది. గురువారం (ఆగస్టు-16)న విజయవాడ బీజేపీ ఆఫీస్ శంకుస్థాపన వాయిదా వేశారు.