ఏపీలో జరిగిన 2014 ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుండి గెలిచి అధికారంలో ఉన్నతెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన భూమా అఖిలప్రియ ప్రతి పక్షంలో ఉన్నవైయస్ జగన్ కుటుంబానికి మధ్య సత్సంబంధాలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో జగన్ జైల్లో ఉన్న సందర్భంలో అఖిలప్రియ తల్లి శోభా నాగిరెడ్డి వైయస్ జగన్ తల్లి విజయమ్మ వెనకనుండి పార్టీని ముందుకు నడిపించారు. అయితే 2014 ఎన్నికల సమయంలో ప్రచారంలో పాల్గొని రాత్రివేళ ఇంటికి చేరుతున్న క్రమంలో మార్గంమధ్యలో ప్రమాదవశాత్తు శోభానాగిరెడ్డి చనిపోవడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే శోభా నాగిరెడ్డి మరణం వైయస్ జగన్ కుటుంబానికి చాలా బాధాకరమైన ఘటన అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా గతంలో జగన్ మేనమామ రవీంద్రనాథ్ తనయుడు తో భూమా అఖిలప్రియ వివాహం అవ్వడం జరిగింది. అయితే అతి కొద్దికాలంలోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో మంత్రి అయిన తర్వాత అఖిల ప్రియా మాజీ డిజిపి సాంబశివరావు అల్లుడు ప్రముఖ పారిశ్రామికవేత్త భార్గవ్ తో పెళ్లికి రెడీ అయిపోయింది. ఈ నెల 29న ఉదయం 10:57 గంటలకు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని భూమా శోభానాగిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల దగ్గర లో ఆమె పెళ్లి జరుగనుంది… ఇప్పటికే వివాహ ఆహ్వాన పత్రికలను మంత్రి కుటుంబ సభ్యులు అందరికి పంపుతున్నారు…. అఖిల పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. ఇందులో బాగంగానే మంత్రి అఖిల జగన్ ఫ్యామిలీని కూడా పెళ్లికి పిలవాలి అనుకుంటునట్లు సమచారం. అఖిల పెళ్లి కార్డు జగన్ ఫ్యామిలీని కలిసి ఆమె సోదరితో కలిసి శుభలేఖ ఇవ్వనున్నారు అని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రజా సంకల్ప పాదయాత్ర లో బిజీగా ఉన్న జగన్ ని కూడ ఆహ్వానిస్తారని సమాచారం.