ఎన్నికలు సమీపిస్తున్న వేళ..తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది నేతలు పక్కపార్టీల వైపు చూస్తున్నారు.ప్రస్తుతం ఉన్న పార్టీ లో వారికి సరైన ప్రాధాన్యత లేకపోవడంతో..వారి భవిష్యత్ కోసం ఇప్పటినుండే దారి చూసుకుంటున్నారు.ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ,నల్లగొండ జిల్లా కోమటి రెడ్డి బ్రదర్స్ గతకొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ లో అసంతృప్తి గా ఉన్నారని గుసగుసలు వినబడుతున్నాయి.అయితే ఇప్పటికే వీరు కొన్ని రోజుల నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు చెందిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత , శాసనసభాపక్షనేత జానారెడ్డిలతో వీరికి సఖ్యత లేకపోవడంతో కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలో చేరేందుకు ప్లాన్ సిద్దం చేసుకున్నట్లు సమాచారం.అందుకోసమే అతి త్వరలోనే కేంద్రమంత్రి రాజ్ నాద్ సింగ్ తో భేటీ కానున్నారని మీడియాలో వార్తలు వెలువడ్డాయి.అయితే ఈ వార్తలపై కోమటి రెడ్డి బ్రదర్స్ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు..
