సౌరవ్ గంగూలీ టీం ఇండియా కు దూకుడుతో పాటు ఘనమైన చరిత్రను అందించిన సీనియర్ స్టార్ క్రికెటర్ .. మాజీ కెప్టెన్ ..ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు . అట్లాంటి సౌరవ్ గంగూలీ నక్క తొక్కడా .. ప్రస్తుతం క్యాబ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న దాదా త్వరలోనే బీసీసీఐ అధ్యక్షుడు కానున్నాడా అంటే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తుంటే అవును అనే అనిపిస్తుంది .
అసలు విషయానికి వస్తే “దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీమ్ కోర్టు లోధా సంస్కరణల్లో చేసిన కొన్ని సవరణల వలన బోర్డు నూతన రాజ్యాంగాన్ని ఇటీవల ఆమోదించింది. దీంతో ప్రస్తుత,మాజీ అడ్మినిస్రేటర్లు బీసీసీఐ అధ్యక్ష పదవికీ అనర్హులు. దీనివలన బీసీసీఐ అధ్యక్ష పదవికీ కొత్తవారు రావడం కన్ఫామ్ . ఈక్రమంలో బోర్డు అధ్యక్ష పదవి బరిలో చాలా మంది మాజీ క్రికెటర్లు ఉన్న కానీ ప్రధాన పోటి దారుడిగా దాదా నిలిచారు .
గత నాలుగేళ్ళుగా క్యాబ్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న దాదా క్యాబ్ వ్యవహారాలను సమర్థంగా నడిపిస్తుండడం, మరోవైపు బీసీసీఐ పలు నిర్ణయాలతో వివాదాస్పదం అవుతున్న తరుణంలో..బోర్డు పాలనను గాడిలో పెట్టడంలో గంగూలీకి మించిన వారు మరొకరుండరన్న అభిప్రాయాలు క్రికెట్ వర్గాల్లో గుసగుసలాడుకుంటున్నారు.ఈ క్రమంలో దాదా ఎంట్రీ ఇస్తే వార్ వన్ సైడే అంటున్నారు క్రికెట్ వర్గాలు..