ఏపీ లో పీడీ అకౌంట్ల మీద యాబై మూడు వేల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల కుంభ కోణం జరిగిందని భారతీయజనత పార్టీ కి చెందిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే . ఇదే అంశం గురించి అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల దగ్గర నుండి మంత్రుల వరకు పీడీ అకౌంట్లలోకి డబ్బులు మళ్ళిన విషయం నిజమే .అయితే ఆ నిధులు పంచాయితీ రాజ్ శాఖ విధులకు ,అభివృద్ధికి వినియోగించామని సమర్ధించుకుంటూ వస్తున్నారు .
అయితే తాజాగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏపీలో యాబై మూడు వేల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది .ఈ విషయం మీద గవర్నర్ వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని శనివారం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కల్సి వినతి పత్రం అందించారు .అంటే కాకుండా 2016-17 కు సంబంధించి పీడీ ఖాతాలపై ప్రత్యెక కాగ్ ఆడిట్ జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు ..