దేశంలో ఎక్కడ చూసిన విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతున్నది. ప్రతి రోజు పోలీసుల జరిపే దాడుల్లో ఖచ్చితంగా విటలు పట్టుబడుతున్నారు. అయితే ఈ వ్యబిచారంలో వ్యాపారస్తులు..సినిమా వాళ్లు, సామన్య ప్రజలు పట్టుబడడం తెలిసిందే. కాని తాజాగా వ్యభిచార రాకెట్ బాగోతంలో సాక్షాత్తూ ముగ్గురు శాసనసభ్యుల పాత్ర ఉందని తేలిన ఘటన అసోం రాష్ట్రంలోని సిల్చార్ పట్టణంలో సంచలనం రేపింది. సిల్చార్ పట్టణంలోని మేహర్ పూర్ ప్రాంతంలోని విహార్ లైన్ లో గుట్టుగా సాగుతున్న వ్యభిచార రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేసి ఇద్దరు వ్యభిచారిణులను అరెస్ట్ చేశారు. ఈ వ్యభిచార రాకెట్ వెనుక బీజేపీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులు, ఏఐయూడీఎఫ్ కు చెందిన మరో ఎమ్మెల్యే పాత్ర ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు బీజేపీ ఎమ్మెల్యేలు అమీనుల్ హఖ్ లస్కర్, కిషోర్ నాథ్, ఏఐయూడీఎఫ్ కు చెందిన నిజాముద్దీన్ చౌదరిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యభిచార రాకెట్ లో ఎమ్మెల్యేలతోపాటు కొందరు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, న్యాయవాదుల పాత్ర కూడా ఉందని పోలీసులు చెపుతున్నారు. వ్యభిచారిణులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టామని, ఈ వ్యభిచార రాకెట్ కేసులో ముగ్గురు ఎమ్మెల్యేలను విటులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశామని కచార్ ఎస్పీ రాకేష్ రౌషన్ వెల్లడించారు.
Tags 3 Assam MLAs in sex scandal sex racket
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023