ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి తన మొండి వైఖరి నిరూపించుకుంది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల అంశంపై వైసీపీ తన వైఖరి స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన ఎన్డీయేకు మద్దతివ్వబోమని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మంగళవారం వెల్లడించారు. డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పారు. దీంతో అధికార తెలుగుదేశం చేస్తున్న దుష్ప్రచారం అవాస్తవమని తేలిపోయింది.
వాస్తవానికి మొదటినుంచి ఎన్డీయేకు వైసీపీ పోరాడుతున్నా.. ప్రత్యేకహోదాపై పోరాటం చేస్తున్నా టీడీపీ మాత్రం జగన్ మోడితో చేతులు కలిపారని ప్రచారం చేస్తోంది. బీజేపీపై ఉన్న వ్యతిరేకతను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలని ఓ కుయుక్తితో వైసీపీకి వోటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్టేనని ప్రచారం చేస్తోంది. ప్రస్తుత ఘటనతో వైసీపీ ఎన్డీయేకు వ్యతిరేకమని తేలిపోయింది.. అయినా చూడాలిమంది చంద్రబాబు దీనిని కూడా ఏవిధంగా మాయచేసి ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తారో..