2014లో జరిగిన ఎన్నికల్లో కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక వైసీపీ ని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరిన సమయంలో ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ నియోజక వర్గ ఇంఛార్జ్‌లతో మీటీంగ్‌లో ఉన్నాడు. బుట్టా రేణుక పార్టీ విడిపోతుందన్న విషయం ముందే తెలిసిన జగన్..అసలు ఏం జరగనట్టుగా ఒకరి తరువాత ఒకరిని వరుసగా నియోజక వర్గ ఇంఛార్జ్‌లను కలుస్తూనే ఉన్నారు. అయితే జగన్ బుట్టా రేణుకా లాంటి వాళ్ళు ఎందరు పోయిన నా గుండె ధైర్యంగానే ఉంటుంది ప్రజలు మరింత ధైర్యంగా ఉండూ అని చెప్పి భుజం తడుతున్నారు అని జగన్ వైసీపీ నేతలతో అన్నరంట. అయితే కర్నూల్ ప్రజలు మాత్రం ఈ విషయం అసలు మరవలేక పోతున్నారంట. ఎందుకంటే ఎటువంటి రాజకీయ నేపధ్యం లేని బుట్టాను వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదరించి టిక్కెట్టిచ్చి కర్నూలు ఎంపిగా పోటీ చేయించారు. అటువంటి మహిళ టీడీపీ లోకి ఫిరాయించటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే, మూడున్నరేళ్ళుగా బుట్టా ఎన్నడూ కర్నూలు అభివృద్ధి గురించి పోరాటం చేసినట్లు లేదు. కర్నూలు జిల్లాలో చెప్పుకో తగ్గ భారీ పరిశ్రమ ఒకటి కూడా లేదు. వాటి గురించి ఏనాడు ప్రశ్నించినట్లు లేదు.చంద్రబాబునాయడుపై అనేకమార్లు విరుచుకుపడ్డ విషయం అందరూ చూసిందే. చంద్రబాబు వల్లే రాష్ట్రాభివృద్ధి సరిగా జరగటం లేదని కూడా అనేకమార్లు ఆరోపించారు. అటువంటిది పార్టీ మారే సరికి అభివృద్ధి గుర్తుకు వచ్చింది. టీడీపీలో చేరిన తర్వాత బుట్టా మాట్లాడుతూ రాష్ట్రం
అభివృద్ధిలో దూసుకుపోతుందని, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగమయ్యేందుకే పార్టీ మారుతున్నట్లు చెప్పటం విచిత్రంగా ఉందని కర్నూల్ జిల్లా ప్రజలు అంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా డిపాజిట్లు కూడ రాకుండ చేస్తాం అంటున్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు . నిజంగా వారికి వైసీపీ మీద ఎంత అభిమానం ఉంటే గడిచిన ఎన్నికల్లో గెలిపిస్తారని ఏపీలో మొత్తం తెలిసింది.
Tags 2019 elactiones butta renuka kurnool tdp ysrcp