ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీకి పట్టు ఉన్నతూర్పుగోదావరి జగ్గంపేటలోని గండేపల్లి మండలం మురారి గ్రామానికి చెందిన బలమైన నాయకులు బుధవారం వైసీపీ కో ఆర్డినేటరు జ్యోతుల చంటిబాబు సమక్షంలో వైసీపీ పార్టీలోకి చేరారు. స్థానికంగా చంటిబాబు కార్యాలయంలో గండేపల్లి మండల పార్టీ కన్వీనరు చలగళ్ల దొరబాబు ఆధ్వర్యంలో మురారికి చెందిన చావ సత్యనారాయణ చౌదరి (అబ్బు), చావ రవీంద్రనాథ్ చౌదరి, చావ వీవీ సత్యనారాయణ చౌదరి(బాబీ), చావ సత్యనారాయణ చౌదరి (పెద్ద అన్నయ్య), చావ పుల్లయ్య, చలగళ్ల వెంకట్రావు, మన్యం వెంకట్రావు, మాదిరెడ్డి వీరభద్రరావు, ముత్యాల భద్రరావు, కోటిన గోవిందు, నూనె మాచరాజు, గద్దె గంగారావు, బత్తుల మునేశ్వరరావు, బోళ్ల వెంకటేశ్వరరావు, చిడిపి బ్రహ్మాజీ, దారా ప్రవీణ్ తదితరులు చేరారు.
వీరికి చంటిబాబు పార్టీ కండువాలను వేసి వైసీపీ పార్టీని గండేపల్లి మండలంలో పటిష్టం చేసేందుకు మురారి గ్రామం ఆదర్శంగా ఉండాలని కోరారు. పార్టీ విజయానికి పనిచేయాలని, పూర్తిగా అండగా ఉంటానన్నారు. సీఎం సామాజికవర్గానికి చెందిన నాయకులు ఒక్కొక్కరుగా గండేపల్లి మండలం నుంచి వైసీపీలోకి చేరుతుండడంతో చంటిబాబు వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బండారు రాజా, పాము సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.