విభిన్న పాత్రలను చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సెట్ చేసుకున్నాడు నటుడు అడవి శేషు తాజాగా నటిస్తున్న చిత్రం గూడాఛారి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పంజా, క్షణం వంటి చిత్రాల్లో గొప్ప నటనను కనబర్చిన అడవి శేషు సినీ విశ్లేషకుల ప్రశంసలను అందుకున్నాడు.
అయితే, అడవిశేషు హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ గూడాఛారి. ఈ చిత్రం ఆగస్టు 3న రిలీజ్ కానుంది. శశి కిరణ్ టిక్కా దర్శకత్వం వహిస్తున్న ఈ చత్రంలో అక్కడ అబ్బాయి.. ఇక్కడ అమ్మాయి చిత్రం హీరోయిన్ సుప్రియ, శోభిత ధూళిపాళ్ల ముఖ్య పాత్రల్లో నటించారు. ఇటీవల ఈ చిత్రం దర్శక నిర్మాతలు విడుదల చేసిన అఫిషియల్ ట్రైలర్ సీనీ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది.