తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలోని చింతపల్లి మండలం నసర్లపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం తెలిసిన పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.మృతులు..హైదరాబాద్ మహానగరంలోని టోలీచౌకీకి చెందిన మోహిన్, అక్బర్, ముస్తఫా, సద్దాం, సమ్మిగా గుర్తించారు.
ప్రమాదం ఎలా జరిగిందంటే..
హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వెళ్తున్న ఓ కారు నసర్లపల్లి దగ్గర అదుపుతప్పి బస్టాండ్ గోడను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారు చనిపోయారు.