ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి పుట్టినరోజు వేడుకలో సినీ స్టార్స్ సందడి చేశారు. శుక్రవారం ఆయన తన 40వ పుట్టినరోజును జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మహేశ్‌బాబు, దేవిశ్రీ ప్రసాద్, నమ్రత, హరీష్ శంకర్ తదితరులు సోషల్‌మీడియా వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి పార్టీ నిర్వహించారు.దీనికి మహేశ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, దిల్‌రాజు, పూజా హెగ్డే తదితరులు హాజరయ్యారు. వంశీ పైడిపల్లితో కేక్ కట్ చేయించి, శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఫొటోలకు పోజులిచ్చారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తమ అభిమాన స్టార్స్ ఒకే చోటు ఉన్న ఫొటోలను ఫ్యాన్స్ తెగ షేర్లు, లైక్‌లు చేస్తున్నారు.
చరణ్-వంశీ పైడిపల్లి కాంబినేషన్లో ‘ఎవడు’ సినిమా వచ్చింది. ఎన్టీఆర్ ‘బృందావనం’ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించారు. మహేశ్ హీరోగా రూపుదిద్దుకుంటోన్న 25వ సినిమాను వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. దిల్‌రాజు నిర్మాత.