ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆ పార్టీ సీనియర్ నేత.. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తో తాను ఏకాంతంగా మాట్లాడిన విషయం తెలిసిందే. దీంతో టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, పయ్యావులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక ఆ విషయం పై చంద్రబాబు కూడా పయ్యావులను తప్పుబట్టినట్టు సమాచారం. దీంతో కలత చెంచిన పయ్యావుల చంద్రబాబు పై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇక జరిగిన ఘటనలో పరిటాల ఇంట పెళ్లికి తానూ ఒక అతిథిగానే వచ్చాననీ, కేసీఆర్ ఎదురుగా కనిపించగానే అభివాదం చేశానని తెలిపాడు. తనదారిన తాను వెళ్లిపోతుంటే ఓ పోలీసు అధికారితో కేసీఆర్ కబురు పెట్టారనీ, ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు పిలుస్తుంటే వెళ్లకపోతే బాగోదని తిరిగి వెళ్లాను అని చెప్పాడు. ఇందులోతన తప్పు ఏముందని పయ్యావుల ప్రశ్నించాడు. ఆ తర్వాత సీఎం కేసీఆరే స్వయంగా తన చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకెళ్లి మాట్లాడారని గుర్తు చేశారు. తానేమీ స్వయంగా వెళ్లి ఏకాంత భేటీలు జరపలేదన్నారు.
పరిటాల శ్రీరామ్ పెళ్లికి అందరిలాగానే తాను కూడా ఓ అతిథిగా వచ్చానని, కేసీఆర్ కనిపిస్తే, ఓ నమస్కారం పెట్టి వెళ్లిపోయానన్నారు. తనతో వచ్చిన ఓ ఉన్నతాధికారిని పంపి నన్ను పిలిపించగా, వెళ్లకుంటే బాగుండదన్న ఉద్దేశంతో కేసీఆర్ దగ్గరికి వెళ్లినట్టు వివరించారు. చెయ్యని తప్పుకు మాటపడటం బాధను కలిగించిందని వాపోయారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన రేవంత్, రమణలు చంద్రబాబుతో సమావేశమై ఈ అంశాన్ని ప్రస్తావన తెచ్చారన్నారు. ఈ తరహా చర్యల ద్వారా కింద స్థాయిలో కార్యకర్తలకు సమాధానం చెప్పలేకపోతున్నామని, ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీకి రాజీనామా చేస్తానని పయ్యావుల గట్టిగానే చెప్పినట్టు సమాచారం.