తెలంగాణ రాష్ట్రంలో పారా మెడికల్ కోర్సుల్లో ప్రభుత్వం సీట్లు పెంచడమేగాక, మరిన్ని కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. పెంచిన, కొత్తగా ప్రకటించిన కోర్సుల్లో మొత్తం 971 సీట్లకు తెలంగాణ పారా మెడికల్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే దరఖాస్తుల, తరగతుల ప్రారంభ తేదీలను తాజాగా ప్రకటించింది. ఆయా కోర్సులు, సీట్ల వివరాలను తమ వెబ్సైట్లో పెట్టింది.
కాగా, పెరిగిన, కొత్త సీట్లు తాజా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకొన్న వాళ్ళకి ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు మంచి భవిష్యత్తు ఉంటుందని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు.
పైగా వైద్య రంగంలో వైద్య డిగ్రీల తర్వాత పారా మెడికల్ కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఉందని మంత్రి చెప్పారు.కాగా, పారా మెడికల్ డిప్లమా రెండేళ్ళ కొత్త కోర్సులు-సీట్ల వివరాలు ఇలా
ఉన్నాయి
డిప్లమా ఇన్ డెంటల్ హైజీనిస్ట్ (40)
డెంటల్ టెక్నీషియన్ (40)
డయాలిసిస్ టెక్నీషియన్ (30)
రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్ (120)
మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (80)
మెడికల్ స్టెర్లైజేషన్ టెక్నీషియన్ (90)
ఎమర్జెన్సీ పారామెడికల్ టెక్నీషియన్ (90)
మైక్రో సర్జరీ టెక్నీషియన్ (10)
ఆడియోమెట్రీ టెక్నీషియన్ (40)
హియరింగ్ ల్యాంగ్వేజ్ అండ్ స్పీచ్ థెరిపీ (40)
హాస్పిటల్ ఫుడ్ సర్వీస్ అండ్ మేనేజ్మెంట్ (10)
మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (10)
ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (10)
మొత్తం 610 సీట్లు
———————-
అలాగే, పాత పారా మెడికల్ కోర్సుల్లో పెరిగిన సీట్ల వివరాలు
మెడికల్ ల్యాబ్ టెక్నీషయన్ (80)
ఆప్టోమెట్రి టెక్నీషియన్ (13)
ఆప్తాల్మిక్ అసిస్టెంట్ (58)
రేడియో థెరపటీ టెక్నీషియన్ (20)
డయాలిసిస్ టెక్నీషియన్ (30)
మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ (70)
మెడికల్ స్టెర్లైజేషన్ టెక్నీషియన్ (10)
అనెస్టీషియా టెక్నీషియన్ (70)
రేడియో గ్రఫీ అసిస్టెంట్ (10)
మొత్తం 361 సీట్లు
ఈ సీట్లన్నీ, ఉస్మానియా, కాకతీయ, గాంధీ, ప్రభుత్వ మహబూబ్‌నగర్, నిజామాబాద్, సిద్దిపేట మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీ, ఇఎన్‌టి హాస్పిటల్, ఎంఎన్‌జె క్యాన్సర్ హాస్పిటల్, ప్రభుత్వ చెస్ట్ హాస్పిటల్ లకు కేటాయించారు.
ఆయా మెడికల్ కాలేజీల్లో ఈ కోర్సుల్లో చేరిన వాళ్ళకు బోధిస్తారు. ఇదిలావుండగా, ప్రభుత్వ కాలేజీల్లో పారా మెడికల్ కోర్సుల దరఖాస్తులకు ఆగస్టు 8వ తేదీని ఆఖరు తేదీగా నిర్ణయించారు. ఆగస్టు 27వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పారా మెడికల్ బోర్డు కార్యదర్శి గోపాల్‌రెడ్డి తెలిపారు. మిగతా వివరాలకు పారా మెడికల్ బోర్డు వెబ్సైట్లో చూడాలని ఆయన చెప్పారు. ప్రైవేట్ కాలేజీలకు కూడా దరఖాస్తుల గడువుని ఆగస్టు 13వ తేదీ వరకు పొడగించారు.