Home / CRIME / ఆస్పత్రిలో 15ఏళ్లుగా పనిచేస్తున్నా.. నా కెరీర్‌లో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు

ఆస్పత్రిలో 15ఏళ్లుగా పనిచేస్తున్నా.. నా కెరీర్‌లో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు

ఆహారం లేక ఆకలితో అలమటించి ముగ్గురు తోబుట్టువులు ప్రాణాలు విడిచిన విషాద ఘటన దేశ రాజధాని దిల్లీ నగరంలో చోటు చేసుకుంది. దిల్లీలో నిన్న 8, 4, 2 ఏళ్ల వయసు గల ముగ్గురు అక్కాచెల్లెళ్లు చనిపోయిన సంగతి తెలిసిందే. వారు ఆకలితో అలమటించి ప్రాణాలు కోల్పోయారని ఈరోజు వైద్యులు ధ్రువీకరించారు. పోస్ట్‌ మార్టమ్‌ తరువాత వైద్యులు ఈ విషయాన్ని ప్రకటించారు. చనిపోవడానికి ముందు ఎనిమిది రోజులుగా వారికి తిండి లేదని తెలిపారు. మంగళవారం ఉదయం ఓ మహిళ తన ముగ్గురు చిన్నారులు స్పృహ తప్పి పడిపోవడంతో ఆస్పత్రికి తీసుకురాగా వారు అప్పటికే మరణించారు. ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ముగ్గురు పిల్లలు ఆకలితో చనిపోవడం అందరినీ కలచివేస్తోంది.

పిల్లల శరీరాల్లో ఏమాత్రం కొవ్వు శాతం లేదని, వాళ్ల కడుపులు పూర్తిగా ఖాళీగా ఉన్నాయని, తీవ్ర పోషకార లోపంతో ఉన్నారని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైందని లాల్‌ బహదూర్‌ శాస్త్రి ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో 15ఏళ్లుగా పనిచేస్తున్నాను, కానీ నా కెరీర్‌లో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని మరో వైద్యుడు అన్నారు. పిల్లల తల్లి మానసిక స్థితి సరిగా లేనట్లు అనిపిస్తోందని పోలీసులు వెల్లడించారు. వారి తండ్రి రిక్షా తోలేవాడు. కాగా శనివారం నుంచి అతడు కనిపించకుండా పోయాడు.

బెంగాల్‌కు చెందిన ఈ కుంటుంబం శనివారం దిల్లీలోని మండావాలి ప్రాంతానికి వచ్చారని స్థానికులు తెలిపారు. వర్షాల కారణంగా వారు ఉంటున్న గుడిసె కూలిపోవడంతో పిల్లల తండ్రి వారిని ఓ చిన్న గదిలోకి తీసుకొచ్చాడని, ఆ తర్వాత నుంచి అతడు కనిపించకుండా పోయాడని చెప్పారు. అతడి రిక్షా పోవడంతో ఏదో ఒక పనిచూసుకోవడానికి వెళ్లి ఉంటాడని అనుకున్నామని తెలిపారు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. పిల్లల తల్లి మానసిక రోగి అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. చిన్నారులను ఆస్పత్రికి తీసుకురాగా, వారు చనిపోవడంతో.. పిల్లలు ఎలా చనిపోయారని ఆమెను అడిగితే.. నాకు ఆహారం ఇవ్వమని అస్పష్టంగా అడిగారని, ఆమె అప్పటికే దాదాపు పడిపోయే పరిస్థితిలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వారు ఉన్న గదిని పరిశీలించగా.. అందులో విరోచనాలకు మందులు ఉన్నాయని వెల్లడించారు. ఘటనపై దిల్లీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

ఈ ఘటనపై దిల్లీలోని ఆప్‌ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. భాజపా, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన నేతలు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. కేంద్రం సబ్సిడీతో ఆహారం, సరుకులు పంపిణీ చేస్తోంది. వాటిని పేదలకు అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని భాజపా దిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ విమర్శించారు. కాంగ్రెస్‌‌ కూడా విమర్శల వర్షం కురిపించింది. అయితే తాము ఇంటి వద్దకే రేషన్‌ అందించేలా పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తుంటే ఆపుతున్నారని ఆప్‌ భాజపాపై విమర్శలు చేసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat