దివంగత ముఖ్యమంత్రి మహా నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ను “యాత్ర” అనే పేరుతో తెరకెక్కిస్తున్నాడు యువ దర్శకుడు మహి వి. రాఘవ్. ఈ మూవీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలోమలయాళీ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్నాడు. బాహుబలి సినిమాతో మంచి పేరు తెచుకున్న ఆశ్రిత వేముగంటి వైఎస్ఆర్ సతిమని విజయమ్మ పాత్రలో నటిస్తున్నారు. వైఎస్ తండ్రి పాత్రలో జగపతిబాబు, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి పాత్రలో సుహాసిని, వైఎస్ కుమార్తె షర్మిళ పాత్రలో భూమిక, సూరీడు పాత్రలో పోసాని నటించనున్నట్టు తెలుస్తోంది. విజయ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ మూవీ పైన ఒక న్యూస్ వైరల్ గా మారింది. ఇక ఈ మూవీలో కీలకమైన వైఎస్ జగన్ పాత్రను ఎవరు చేస్తారనే వార్తల నేపథ్యంలో తమిళ హీరో కార్తీ ఈ పాత్రకోసం ఎంపికైనట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. ఇటీవల ‘చినబాబు’ చిత్రంతో సక్సెస్ అందుకున్న కార్తీ.. ఈ పాత్రకు పర్ఫెక్ట్‌గా సరిపోతాడని నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇక తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ మూవీని విడుదల చేస్తుండగా.. కార్తీకి తమిళ్‌లో ఉన్న పాపులారిటీ ఈ చిత్రానికి హెల్ప్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. 70 ఎంఎ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. సంక్రాంతి కానుకగా 2019లో ప్రేక్షకుల ముందుకు రానుంది ‘యాత్ర’సినిమా.
Home / ANDHRAPRADESH / వైఎస్సార్ బయోపిక్ లో జగన్ పాత్ర చేస్తున్నహీరో ఎవరో తేలిస్తే..రోమాలు నిక్కబోడుచుకుంటాయి
Tags tamil hero karthik Tolly wood ys jagan ysr biopic