మహానటితో కీర్తి సురేష్ అభినవ సావిత్రిగా మారింది. మరో సీనియర్ నటి త్రిష కూడా కార్తి దారిలోనే వెళ్లాలనుకుంటోంది. ఒక్క ఛాన్స్ ఇస్తే తాను కూడా బయోపిక్‌లో నటిస్తానంటోంది. అయితే, త్రిష ఒక కండీషన్ పెడుతోంది. తాను సినీ నటుల బయోపిక్స్‌లో కాకుండా రాజకీయ నేపథ్యం ఉన్న నాయకురాలి జీవిత పాత్రలో మాత్రమే నటిస్తానంటోంది.
అయితే, తమిళులందరూ జయలలితను అమ్మగా పిలుస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. నాయికగా, నాయకురాలుగా తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం బయోపిక్స్‌కు చాలా క్రేజ్ ఏర్పడింది. ఇదే దారిలో జయ లలిత జీవితాన్ని తెరకెక్కిస్తే ప్రజలు బ్రహ్మరథం పడతారని కోలీవుడ్ దర్శక నిర్మాతలు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారు రైట్స్ విషయంలో బిజీ.. బిజీగా గడుపుతున్నారు. అయితే, జయలలిత పాత్రలో ఎవరు నటిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పురుచ్చి తలైవి జీవిత కథ వెండితెరకు ఎక్కితే తాను అమ్మగా నటించేందుకు సిద్ధమని ప్రకటించింది త్రిష. ప్రస్తుతం ఈ హీరోయిన్ మోహిని చిత్రం ప్రమోషన్స్‌లో బిజీ.. బిజీగా గడుపుతోంది. ఈ సినిమా ప్రమోషన్లో త్రిష తన మనసులోని మాటను బయటపెట్టింది. జయ లలిత పాత్రలో నటించేందుకు తానురెడీగా ఉన్నట్టు చెప్పకనే చెప్పింది. అవసరమైతే, తాను పాత్ర కోసం వెయిట్ పెరుగుతాని చెప్పుకొస్తోంది.