తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సిద్దపేట జిల్లాలో కొండపాక మండలం దుద్దెడలో జిల్లా కార్యాలయ సముదాయం, పోలీస్‌కమిషరేట్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ భవనాల నమూనాలను పరిశీలించిన అనంతరం శిలాఫలకాలను ఆవిష్కరించారు. అదేవిధంగా సిద్దిపేట మండలం ఎన్సాన్ పల్లిలో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు వినోద్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, రామలింగారెడ్డితోపాటు ఎమ్మెల్సీలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.