తెలంగాణా యువనేత ,ఐటీ మరియు పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్బంగా
కాశిబుగ్గ కోటిలింగాల అగ్నిప్రమాద బాదితుల కుటుంబాలకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ నరేందర్ ఆర్థిక సాయం అందజేసారు.బాదిత కుటుంబాలైన 10కుటుంబాలకు కుటుంబానికి 10వేల ఆర్థికసాయం,50కేజీల బియ్యం,నెలరోజుల కు సరిపడా సామాగ్రిని మేయర్ అందజేసారు.
ఈ సందర్బంగా మేయర్ నరేందర్ మాట్లాడుతూ బాంబుల ఫాక్టరీల జరిగిన ఘటన అందరి హృదయాలను కలచివేసిందని అది చాలా బాదాకరమని మేయర్ తెలిపారు.ఈ రోజు రాష్ట్ర పురపాలక శాఖామంత్రి శ్రీ కేటీఆర్ గారి జన్మధినం సందర్బంగా ఆ బాదిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయడం జరిగిందని మేయర్ తెలిపారు.మంత్రి కేటీఆర్ గారు తన జన్మధినం సందర్బంగా ప్లెక్సీలు,కేక్ లు కట్ చేసి డబ్బులు వృదా చేయకుండా ఆ డబ్బులతో ఏదైనా మంచి కార్యక్రమం చేయండని తెలిపారు.
వారి సూచన మేరకు ఈ కార్యక్రమం చేయడం జరిగిందని మేయర్ అన్నారు.అగ్నిప్రమాద బాదిత కుటుంబాలకు అండగా ఉంటామని,ఇప్పటికే వారి కుటుంబాలకు 5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం అందించిందని,డబుల్ బెడ్ రూం ఇండ్లు కూడా అందజేస్తుందని,వారి పిల్లల విద్య వైద్యం తో పాటు అన్ని విషయాల్లో వారికి అండగా ఉంటామని మేయర్ తెలిపారు.ప్రజా సేవే మార్గంగా ముందుకెలుతున్న మంత్రి కేటీఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తామని మేయర్ తెలిపారు.